కన్నుల పండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం - శ్రీవల్లీ దేవసేనా సమేత స్వామి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 1:40 PM IST
Subramanya Swamy Kalyanam in Mopidevi: కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కల్యాణం కన్నుల పండువగా జరిగింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి పది గంటల వరకూ అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం జరిగిందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.
వేద పండితులు, మంత్రోచ్చారణలతో వైభవంగా స్వామి కల్యాణాన్ని నిర్వహించారు. యాగ్నిక బ్రహ్మ కొమ్మూరి ఫణిశర్మ అధ్వర్యంలో ఆలయ అర్చకులు కల్యాణ వేడుక నిర్వహించారు. అర్చకులు వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారి కల్యాణం (Kalyanam) కన్నుల పండువగా జరిగింది. ఈరోజు రాత్రి 8 గంటలకు స్వామి వారి రథోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు అర్చకులు తెలిపారు. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavaalu) 17తేదీ వరకు జరగనున్నట్టు అర్చకులు తెలిపారు.