ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి - Supreme Court Judge - SUPREME COURT JUDGE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 5:01 PM IST

Subrahmanyeshwar Swamy Temple Visit Supreme Court Judge in Krishna District : కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్​. వెంకట నారాయణ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామి సేవలో తరించారు. ఆలయ దేవాదాయ శాఖ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, పండితులు మేళ తాళాలతో ఆలయంలోకి ఆహ్వానించారు. 

Mopidevi Village Krishna District : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని, అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షం వద్ద పూజలు చేసి ముడుపులు కట్టారు. దేవస్థానం మర్యాద ప్రకారం ఆలయ అధికారులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులకు పట్టు వస్త్రాలను బహుకరించారు. అనంతరం స్వామి వారి చిత్రపటం, ప్రసాదమును అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పాటు కృష్ణాజిల్లా కోర్టు న్యాయమూర్తి అరుణ సాహిత, హైకోర్టు విభాగాల రిజిస్ట్రాటర్లు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details