ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విజయవాడలో ఘనంగా మలేషియా ఎడ్యుకేషన్ ఫెయిర్ - vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 7:03 PM IST

Study In Malaysia Education Fair in Vijayawada : మలేషియాలోని ఉన్నత విద్యావకాశాలను మన విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు తొలిసారిగా విజయవాడలో మలేషియా గ్లోబల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ, మలేషియా, భారత్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల గురించి వివరించారు. అలాగే విద్యాపరంగా మరింత ముందు తీసుకెళ్లేందుకున్న అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మలేషియా విశ్వవిద్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో కలిసి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా మన దేశ విద్యార్ధులు సులువుగా మలేషియా వెళ్లేందుకు వీలుందని మలేషియా విద్యాసంస్థల ప్రతినిధులు వెల్లడించారు. 2020 - 2023 మధ్య మలేషియా విద్యాలయాలకు 7,417 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని వివరించారు. మలేషియాలో తమ విద్యను కొనసాగించడానికి ఎక్కువ మంది దక్షిణాది రాష్ట్రాల విద్యార్ధులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్, ఇంజనీరింగ్ ట్రేడ్స్ వంటి ముఖ్యమైన విభాగాల్లో విద్యార్ధులు ఎక్కువగా చేరుతున్నారని మలేషియా ప్రతినిధులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details