తెలంగాణ

telangana

అనారోగ్యాల బారిన పడుతున్న గురుకుల విద్యార్థులు - ఒక్క రోజులోనే ముగ్గురికి అస్వస్థత - Gurukul Students illnesses

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 10:43 AM IST

Students suffering From Illnesses (ETV Bharat)

Gurukul Students Suffering From Illnesses : ములుగు జిల్లాలోని బండారుపల్లి తెలంగాణ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. 12గంటల వ్యవధిలోనే ముగ్గురు ఆసుపత్రుల పాలవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి 8వ తరగతి విద్యార్థి అస్వస్థతకు గరికావడంతో, ఉపాధ్యాయులు ఆ బాలుడిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా ఏదో విష పురుగు పట్టిందని డాక్టర్లు తెలపడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స అందిస్తున్నారు.

శుక్రవారం ఉదయం తెల్లవారుజామున పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి కడుపు నొప్పితో బాధపడుతుండగా, ఆసుపత్రి తీసుకెళ్లారు. నొప్పి తీవ్ర కావడంతో బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. అదేరోజు ఉదయం 8గంటల సమయంలో ప్రార్ధన జరుగుతుండగా మరో విద్యార్థి అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడటంతో అతన్ని హుటాహుటిన ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హన్మకొండ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొద్ది వ్యవధిలోనే ముగ్గురి విద్యార్థులకు ఇలా జరగడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details