కుప్పకూలిన క్వారీ - నుజ్జునుజ్జయిన ప్రొక్లెయిన్, ట్రాక్టర్, బైక్ - కార్మికులు షాక్ - STONE QUARRY ACCIDENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2024, 5:46 PM IST
Kachavaram Stone Quarry Accident: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శివారు కాచవరం గ్రామ పరిధిలోని రాతి క్వారీలో పెనుప్రమాదం తప్పింది. క్వారీపై నుంచి పెద్దపెద్ద బండరాళ్లు దొర్లి కింద ఉన్న బైక్, ట్రాక్టర్, ప్రొక్లెయిన్పై పడ్డాయి. దీంతో అవి పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదే సమయంలో క్వారీలో పనిచేస్తున్న కార్మికులు భోజనం కోసం అని కిందికి దిగివచ్చారు. వారంతా భోజనం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ఆపరేటర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే బాధితున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్, ప్రొక్లెయిన్ నుజ్జునుజ్జు కావడంతో, కార్మికులు ఆందోళన చెందారు. కాస్త సమయం ముందు ఈ ఘటన జరిగి ఉంటే భారీ ప్రమాదం చోటుచేసుకుని ఉండేదని షాక్కు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్ద గాయాలు కాకపోవడండో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్న ప్రమాదం అనంతరం దృశ్యాలను ఈ వీడియోలో చూద్దాం.