స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధమే: కడియం శ్రీహరి - MLA KADIYAM SRIHARI HOT COMMENTS - MLA KADIYAM SRIHARI HOT COMMENTS
Published : Sep 26, 2024, 5:32 PM IST
MLA KADIYAM SRIHARI HOT COMMENTS: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. 9 నెలలు కూడా పూర్తికాని కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పని ఇవాళ రైతు రుణమాఫీని 23 లక్షల మందికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసి అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ ఖజానాను అప్పజెప్పి ఇవాళ మీ మేదో బ్రహ్మాండంగా చేశామని మాట్లాడుతున్నారని కడియం దుయ్యబట్టారు.
ప్రస్తుతం ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నారని అసలు వాటిని ప్రోత్సహించిందే మీరు అని, అప్పుడు గుర్తుకు రాలేదా అని కడియం మండిపడ్డారు. మాకు కోర్టుల పట్ల గౌరవం ఉందని ఆ కోర్టులు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని కడియం శ్రీహరి స్పష్టంగా పేర్కోన్నారు. కాగా కడియం 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అప్పటీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను నిరాకరించింది.