ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి- ఇప్పటి వరకు 3వేల మలేరియా కేసులు: హెల్త్ డైరెక్టర్‌ పద్మావతి - Seasonal Diseases in ap - SEASONAL DISEASES IN AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 4:01 PM IST

State Health Director Padmavathi Interview on Seasonal Diseases : రాష్ట్రంలో వర్షకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వ్యాధులను అరికట్టేందుకు వైద్య శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిపై ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ పద్మావతి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అల్లూరి, మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఆ ప్రాంతాల్లో ఆశ, ఏఎన్​ఎం, మెడికల్ ఆఫీసర్​లతో కూడిన టీంలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. 

అక్కడ ఎక్కువగా అడవి ప్రాంతం కావడమేగాక వర్షాలు అధికంగా పడటంతో ఎప్పుడు తడి వాతావరణం ఉంటుందని తెలిపారు. దీంతో దోమలు ఎక్కువగా వృద్ధి చెంది మలేరియా వ్యాధులు వస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3వేల మలేరియా కేసులు నమోదయ్యాయని వివరించారు. అలాగే తగినన్ని ఔషధాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరిశుభ్రతను పాటించడంతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు అరికట్టవచ్చాని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details