ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని సీజ్ చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి - TIRUMALA VISAKHA SARADA PEETAM - TIRUMALA VISAKHA SARADA PEETAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 5:28 PM IST

Srinivasananda Saraswati Comments on Visakha Sarada Peetam : తిరుమలలో అక్రమంగా నిర్మించిన విశాఖ శారదా పీఠాన్ని తక్షణమే టీటీడీ స్వాధీనం చేసుకోవాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సర్వసతి స్వామీజీ డిమాండ్ చేశారు. విశాఖ శారదా పీఠం పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆయన అన్నారు. విశాఖ శారదా పీఠం నిర్వాహకులు తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. శ్రీవారి ఆలయం కంటే ఎక్కువ ఎత్తులో కట్టడాలు చేపట్టారని స్వామిజీ పేర్కొన్నారు. 

పీఠం భవనానికి వెనక వైపు వాగును కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని స్వామీజీ మండిపడ్డారు. చాలా మఠాల్లో పూజలు, భజనలు, దార్మిక కార్యక్రమాలు వంటివి పట్టించుకోకుండా వసతి గదులు, పెళ్లిళ్ల మండపాలు, అన్నదానాలతో వ్యాపారం చేసుకుంటున్నారని స్వామిజీ పేర్కొన్నారు. తిరుమలలో 80 శాతం మఠాలు ముఠాలుగా ఏర్పడి దోపిడీ చేస్తున్నాయని శ్రీనివాసానంద అన్నారు. మఠాల పేరుతో దోపిడీ చేస్తున్న దళారీలపై చర్యలు తీసుకోకపోతే దీక్షలు చేసేందుకు వెనుకాడబోమన్నారు.  

ABOUT THE AUTHOR

...view details