ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జ్యోతిష్య శాస్త్ర సారమే పంచాంగం- గ్రహాల గమనంపై శాస్త్రీయ అంచనా : వెంకట ఫణికుమారశర్మ - Significance of Ugadi 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 4:05 PM IST

Spiritualist PV Phani Kumar Sharma on Significance of Ugadi 2024 : తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగకు ఎంతో విశిష్టత ఉంది. తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉన్నాయి. అందులో 38వ సంవత్సరం, కలియుగంలో 5,125వ సంవత్సరమే శ్రీ క్రోధి నామ సంవత్సరం. 2024 ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం క్రోధి నామ సంవత్సరం ప్రారంభమైంది. తెలుగు సంవత్సరంలో అందరూ పంచాంగాన్ని చూసి ఏ రాశి వారికి బాగుందో లేదో తెలుసుకుంటారు. 

Significance of Ugadi : జ్యోతిష్య శాస్త్రం మనకు ఇచ్చిన అద్భుతమైన వరం పంచాంగమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు పులుపుల వెంకట ఫణికుమార శర్మ అన్నారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ప్రకారం ఈ ఏడాది ఏ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో శాస్త్రీయంగా అంచనా వేయొచ్చని తెలిపారు. అందుకే తెలుగు సంవత్సరాది రోజున పంచాంగ శ్రవణం తప్పనిసరని సూచించారు. పంచాంగ శ్రవణం ఓ కౌన్సిలింగ్ సెంటర్ వంటిదని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ పంచాగం అనుసరించి శుభ ఫలితాలు పొందవచ్చని ఆయన సూచించారు.

ABOUT THE AUTHOR

...view details