తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ప్రత్యేక చర్చ - exit polls 2024

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 6:41 PM IST

Updated : Jun 1, 2024, 7:58 PM IST

Exit Polls Results 2024 : దేశంలో ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. పలు సంస్థలు సర్వే నిర్వహించి తమ తమ అంచనాలను వెలువరించాయి. ఈనెల 4న కౌంటింగ్ అనంతరం తుది ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు పలు దఫాల్లో జరగడంతో ఎగ్జిట్ పోల్స్​పై ఈసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇవాళ్టితో ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 19 తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 తేదీ సాయంత్రం 6.30 గంటల వరకూ ప్రసార మాధ్యమాల్లో ఎగ్జిట్ పోల్స్​పై నిషేధం విధిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో సామాజిక మాధ్యమాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇవ్వడంపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ నిర్దేశించిన తేదీల మధ్య ఒపీనియన్ పోల్, పోల్ సర్వే తరహా ఎన్నికల సంబంధిత నిర్ణయాలు వెలువరించవద్దని పేర్కొంటూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. లోక్​సభ, శాసన సభ ఎన్నికలతో పాటు 13 రాష్ట్రాలలో జరిగే ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వొద్దని సూచనలు జారీ చేశారు. 
Last Updated : Jun 1, 2024, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details