పిల్లనిచ్చిన మామను హతమార్చిన అల్లుడు - కారణం తెలిస్తే షాక్ అవుతారు - Son In Law Killed Uncle - SON IN LAW KILLED UNCLE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 20, 2024, 2:12 PM IST
Son In Law Killed Uncle In Eluru District : ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురం గ్రామంలో పిల్లనిచ్చిన మామను అల్లుడు ఇనుపరాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లాజర్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. 20 సంవత్సరాల క్రితం తన పెద్ద కుమార్తెను జి. కొత్తపల్లి గ్రామానికి చెందిన సుబ్బారావుకు ఇచ్చి వివాహం జరిపించాడు. గత సంవత్సరకాలంగా సుబ్బారావు అతని భార్య గొడవల కారణంగా విడివిడిగా ఉంటున్నారు.
సుబ్బారావు భార్య తన తండ్రి లాజరు వద్దనే ఉంటోంది. కుటుంబ పోషణ నిమిత్తం సుబ్బారావు భార్య కువైట్ వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం సుబ్బారావు భార్య హైదరాబాద్ చేరుకుంది. ఆమె కువైట్ వెళ్లేందుకు తన మామ లాజరే కారణమని అతనిపై కక్ష పెంచుకొన్న సుబ్బారావు రాత్రి ఇనుప రాడ్డుతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ దాడిలో లాజర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు ప్రారంభించారు. నింధితుడు సుబ్బారావు పరారీలో ఉన్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.