ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తల్లిని రోకలిబండతో కొట్టి చంపిన కొడుకు - మతిస్థిమితం లేక దాడి చేశాడన్న తండ్రి - Son Killed his Mother - SON KILLED HIS MOTHER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 4:34 PM IST

Son Beats Mother to Death in Nandyala District: తల్లిని, కొడుకు రోకలిబండతో కొట్టి చంపడం నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఒడ్డుగండ్లలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడ్డుగండ్లకు చెందిన గోపాల్-నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు మహేష్ ఉన్నారు. కొద్ది కాలంగా మహేష్ మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడని ఆతని తండ్రి గోపాల్‌ తెలిపారు. ఇంట్లో చెత్త ఊడుస్తున్న సమయంలో తల్లి అంగజాల నాగలక్ష్మమ్మపై (58) కుమారుడు మహేష్ ఒక్కసారిగా రోకలిబండతో దాడి చేయడంతో తల్లి అక్కడికక్కడే కుప్పకూలింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో నాగలక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం మహేష్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తల్లిని చంపానని లొంగిపోయాడు. విషయం తెలులుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. గత కొద్ది కాలంగా మతిస్థిమితం లేక కుమారుడు తిరుగుతున్నాడని అందువల్లనే తల్లిపై దాడి చేశాడని మహేష్‌ తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ నల్లప్ప పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details