కూల్ డ్రింక్ డబ్బాలో ఇరుక్కుపోయిన పాము - చివరకు ఏవిధంగా బయటపడిందంటే? - A snake stuck in an empty bottle - A SNAKE STUCK IN AN EMPTY BOTTLE
Published : Aug 16, 2024, 6:23 PM IST
Snake Gets Stuck In Bottle : ఓ పాము ప్రమాదవశాత్తు ఖాళీ కూల్డ్రింక్ డబ్బాలో తల ఇరుక్కుపోయి దారి కనిపించక నరకయాతనతో తల్లడిల్లింది. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో జరిగింది. చివరకు సురక్షితంగా ఏవిధంగా బయటపడిందంటే?
ఇదీ జరిగింది : ఓ పాము సమీపంలో ఉన్న కూల్ డ్రింక్ డబ్బాలోకి తలదూర్చింది. దీంతో అందులోనే పాము తల ఇరుక్కుపోయి పెనుగులాడింది. ఎంతకూ తల బయటకు రాకపోవడంతో చాలా సేపు అందులోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. పాము పడుతున్న అవస్థలను గమనించిన స్థానికులు సర్పాన్ని రక్షించే ప్రయత్నం చేసి ఆ కూల్ డ్రింక్ డబ్బాను బయటకు తీసేందుకు చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలించలేదు. పాము ఆ డబ్బాను తన తల నుంచి విడిపించుకునేందుకు చాలా సేపు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఓ ముళ్ల కంపలోనికి వెళ్లింది. దీంతో ఆ ఖాళీ డబ్బా ఊడిపోయింది. దీంతో బతుకుజీవుడా అనుకుని వెళ్లిపోయింది.