నాగోన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో పొగలు - తప్పిన పెను ప్రమాదం - Smoke in Nagaon Express Train - SMOKE IN NAGAON EXPRESS TRAIN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 10:11 PM IST
Smoke in Nagaon Express Train : నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అస్సాం రాష్ట్రంలోని సిగాట్ నుంచి తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్న నాగోన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు : నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని అడవిరాజుపాలెం-సిరిపురం రైల్వే గేటు వద్ద నాగోన్ ఎక్స్‌ప్రెస్ (Nagaon Express Train)లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ట్రైన్‌ను నిలిపివేశారు. దీంతో భోగిల్లో ఉన్న ప్రయాణికులు రైలు దిగి భయాందోళనలకు గురై పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మరమ్మతులు చేశారు. జనరల్ భోగి బ్రేక్ డౌన్ వల్లే పొగ వచ్చిందని తెలిపారు. నాగోన్ ఎక్స్‌ప్రెస్ రైలు అస్సాం రాష్ట్రంలోని సిగాట్ నుంచి తమిళనాడు రాష్ట్రానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు లేకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు.