సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల ట్రయల్ రన్ సక్సెస్ - త్వరలోనే ప్రారంభం - Sitarama Project Trial Run - SITARAMA PROJECT TRIAL RUN
Published : Aug 1, 2024, 10:30 PM IST
Sitarama Lift Irrigation Project Trial Run Success : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వేప కొయ్య రామవరం సమీపంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్‌ను అధికారులు గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఎత్తిపోతల పథకంలో ఆరు విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేశారు. వాటి నిర్మాణ పనులు పూర్తికావడంతో ఒక మోటారు పని తీరును ట్రయల్ రన్ ద్వారా పరీక్షించారు. 1500 క్యూసెక్కుల నీరును ఒక్కొక్క మోటారు ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పది నిమిషాల పాటు నిర్వహించిన ట్రయల్ రన్ సందర్భంగా మోటారు ఎత్తిపోసిన నీటిని సమీపంలోని పాములేరు వాగులోకి వదిలారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులు కేరింతలు కొట్టారు. త్వరలోనే అధికారికంగా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఖమ్మం జిల్లాలోని సాగుకు నిరంతరం నీటి లభ్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన పనులను చకచకా చేస్తోంది.