ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వర్షానికి మార్కెట్​లో తడిసి ముద్దైన పట్టుగూళ్లు - రోడ్డుపై బైఠాయించిన రైతులు - Silk Farmers in Hindupur - SILK FARMERS IN HINDUPUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 3:21 PM IST

Silk Farmers Protest on Road in Hindupur : సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్లో విక్రయించేందుకు తీసుకొచ్చిన పట్టు గూళ్లు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వర్షానికి సమీపంలోని మురుగు కాలువ నుంచి మార్కెట్లోకి నీరు చేరడంతో పట్టుగూళ్లు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. దీంతో రైతులు తడిసిపోయిన పట్టుగూళ్లను రోడ్డుపై వేసి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పట్టు గూళ్ల గోదాము శిథిలావస్థకు చేరినా, తరచు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులకు ఎందుకు పట్టడం లేదని మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని రైతులు తెలిపారు. వర్షాల సమయంలో ముందస్తు చర్యలు చేపట్లేదని రైతులు ఆగ్రహించారు. ఇప్పటికైనా మార్కెట్‌ యార్డును బాగు చేయించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పట్టుగూళ్ల నిల్వకు తగిన సదుపాయం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details