ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

యాదవాపురంలో శ్రీనివాసుల హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం - సిట్ ఏర్పాటు - Pendlimarri SI suspend - PENDLIMARRI SI SUSPEND

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 3:03 PM IST

SI Suspended in Youth Murder Case in YSR District : వైఎస్సార్​ జిల్లాలో ఓ యువకుడి హత్య కేసులో ఎస్​ఐపై వేటు పడింది. పెండ్లిమర్రి మండలం యాదవాపురానికి చెందిన శ్రీనివాసుల హత్య కేసులో స్థానిక ఎస్​ఐ సునీల్​ కుమార్​ రెడ్డిని వీఆర్​కు పంపుతూ జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్​ ఆదేశాలు జారీ చేశారు. ఈ హత్యలో వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న తరుణంలో అధికార నేతలకు వత్తాసు పలికినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

Srinivas Murder Case YSR District : భూ వివాద విషయంలో తమకు న్యాయం చేయాలని మృతుడు శ్రీనివాసులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులతో పెట్టుకోవద్దని ఎస్​ఐ సునీల్​ కుమార్​ రెడ్డి ఉచిత సలహా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఆరోపణ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్​ అదనపు ఎస్పీ వెంకట్రాముడు ఆధ్వర్యంలో సిట్​ను ఏర్పాటు చేశారు. శ్రీనివాసులు హత్య కేసుల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

...view details