LIVE: ఏలూరు జిల్లా పోలవరంలో షర్మిల న్యాయయాత్ర బహిరంగ సభ ప్రత్యక్షప్రసారం - Polavaram Sharmila nyaya Yatra - POLAVARAM SHARMILA NYAYA YATRA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 5:10 PM IST
|Updated : Apr 29, 2024, 5:27 PM IST
Sharmila nyaya Yatra Live from Polavaram : ఆంధ్రప్రదేశ్ న్యాయయాత్రలో భాగంగా ఎపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఏలూరు జిల్లా పోలవరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ సీఎం ప్రత్యేక హోదా కోసం పోరాడలేదు, మద్యపాన నిషేధం చేయలేదు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదని షర్మిల ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి వాటినే ప్రభుత్వ ఉద్యోగాలుగా మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులని ఊదరగొట్టి ఒక్క నగరాన్ని కూడా నిర్మించలేదు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదు, పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. అన్ని విషయాల్లో విఫలమైన మీకు మళ్లీ ఎందుకు ఓటెయ్యాలని షర్మిల జగన్ను ప్రశ్నించారు. మీ మ్యానిఫెస్టోను తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయండి అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్న హామీలు నెరవేర్చన ప్పుడు కొత్త మ్యానిఫెస్టోను ఎలా నమ్మాలని షర్మిల ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగ సభలో మండిపడ్డారు.
Last Updated : Apr 29, 2024, 5:27 PM IST