తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తిరుమల ఆలయంలో శాంతి హోమం - TIRUMALA SHANTHI HOMAM LIVE TODAY - TIRUMALA SHANTHI HOMAM LIVE TODAY

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 9:03 AM IST

Updated : Sep 23, 2024, 12:05 PM IST

Tirumala Live Today : తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి హోమం ప్రారంభమైంది. శ్రీవారి నైవేద్యాలు, లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతిహోమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు చేయనున్నారు. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ చేయనున్నారు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండటం వల్ల అపచారం కలిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతిహోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు. మరోవైపు లడ్డూ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. నెయ్యి స్వచ్ఛతని తేల్చేందుకు 18 మందితో ల్యాబ్‌ ప్యానెల్‌ని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందన్నారు. అయినప్పటికీ భక్తుల్లో ఆందోళన తొలగించేందుకు ఇవాళ శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Last Updated : Sep 23, 2024, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details