అప్పుపై కోర్టులో కేసు వేసి తన పరువు తీశాడని సెల్ఫీ సూసైడ్- మచిలీపట్నంలో కలకలం - Selfie Suicide in Vijayawada - SELFIE SUICIDE IN VIJAYAWADA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 3:55 PM IST
Selfie Suicide in Vijayawada : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ వ్యక్తి సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. వడ్డీ వ్యాపారస్థుడి వేధింపులు తాళలేక మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి మరణానికి కారకులైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఖాదర్ ఖాన్ కుమారుడు అంజత్ ఖాన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కొల్లిపర శివ అనే వడ్డీ వ్యాపారి వద్ద 70వేల రూపాయలు అప్పు తీసుకున్నానని, చక్ర వడ్డీ రూపంలో లక్షల్లో తన వద్ద నుంచి వడ్డీ వ్యాపారి వసూలు చేశాడని ఖాదర్ ఖాన్ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. అప్పుపై కోర్టులో కేసు వేసి తన పరువు తీశాడని ఆవేదన వ్యక్తం చేసాడు. అందుకే తను ఆత్మహత్య చేసుకుంటున్నాని వీడియోలో పేర్కొన్నాడు. వ్యాపారీ శివ ఒత్తిళ్లకు తాళలేకనే తన తండ్రి మృతి చెందాడని అంజత్‌ఖాన్ ఆరోపించారు. తక్షణమే అతనపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.