అదరగొట్టేస్సార్రా అబ్బాయిలు - భక్తి పాటకు మాస్ బీట్ వీడియో వైరల్ - శంకరా సాంగ్ వైరల్ వీడియో
Published : Feb 18, 2024, 10:03 PM IST
School Boys Shankara Song Viral Video : అది ఓ అచ్చమైన తెలుగు పాట. దానిని పాడాలంటే పెద్దవారికి కూడా నోరుమళ్లడం కష్టమే. కానీ ఈ బుడ్డోడు మాత్రం గుక్క తిప్పుకోకుండా పాడాడు. పైగా ఈ పాటకి మరో బాలుడు కాంపాక్స్ బాక్స్, స్కూల్‌బల్లపై దరువు వేసూ బ్యాక్‌గ్రౌండ్ బీట్ జతచేశాడు. శంకరాభరణం సినిమానిలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన 'శంకరా నాద శరీరా పరా' పాటను ఓ బాలుడు పాడాడు. అది ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాజాగా రాష్ట్ర పోలీసు శాఖ ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ ఆ బాలల ప్రతిభను ఎక్స్ వేదికగా ప్రశంసించింది.
"అందరిలోనూ కళ దాగి ఉంటుందని, మన దేశంలోని బాలల్లో, యువతలో ప్రతిభకు కొదవలేదు. తెలుసుకోవాల్సింది మంచి చెడుల మధ్య ఉండే సన్నని గీత మాత్రమేనని కితాబునిచ్చింది. అది తెలుసుకుంటే యువ భారతం పరిఢవిల్లి, ఆవిష్కరణల నిలయంగా భారత్ మారుతుందని" ఎక్స్ వేదికగా పోలీసు శాఖ ట్వీట్ చేసింది. కాగా స్కూల్ బెంచ్, కంపాస్ బాక్స్‌లపై మంచి సంగీతం ధ్వనింపజేసిన, మంచి గాత్రంతో అందంగా పాడుతున్న ఈ బుడ్డోళ్ల ప్రతిభకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.