ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఆప్కాస్​లోకి తీసుకుంటామని ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం మోసం' - Workers Protest Boycott Duties

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 1:48 PM IST

Sanitation Workers Protest Second Day Then Boycott Duties: ఆప్కాస్​లోకి తీసుకోవాలంటూ రాష్ట్ర సచివాలయం, శాసనసభలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు రెండో రోజు విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. తుళ్లూరు మండలం మల్కాపురం నుంచి సచివాలయానికి వెళ్లే దారిలో కార్మికులు నిరసన దీక్ష కొనసాగించారు. కార్మికులకు రాజధాని ప్రాంత సీఐటీయు నాయకులు మద్దతు పలికారు. గత ఐదేళ్లుగా ఆప్కాస్​లోకి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం తమను మోసం చేసిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో చాలీచాలని జీతంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోయారు. కాంట్రాక్టర్ మారిన ప్రతిసారి తమ జీతంలో కోత విధిస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా తమను ఆప్కాస్​లోకి తీసుకుంటుందనే ఆశతో ఇప్పటివరకు పనిచేశామని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను అప్కాస్‌లోకి తీసుకోకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

తొమ్మిది సంవత్సరాల నుంచి నలుగురు కాంట్రక్టర్ల దగ్గర పని చేశాం. జనాలను తగ్గిస్తూ జీతాలను ఇవ్వకపోవడం చేసేవారు. ఆప్కాస్​లోకి చేర్చుకోవాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. దయచేసి మమ్మల్ని ఆప్కాస్​లోకి తీసుకోవాలని సీఎం జగన్​ను వేడుకుంటున్నాం. -పారిశుద్ధ్య  కార్మికులు

ABOUT THE AUTHOR

...view details