LIVE : నల్గొండలో సద్దుల బతుకమ్మ వేడుకలు - BATHUKAMMA CELEBRATIONS HYDERABAD
Published : Oct 10, 2024, 7:06 PM IST
|Updated : Oct 10, 2024, 8:23 PM IST
Saddula bathukamma Celebrations In Hyderabad 2024 : ఖమ్మంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రంగు రంగుల పూలను ఒద్దికగా పేర్చి బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడిపాడుతున్నారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో, ఆడపడుచులతోనూ మురిసిపోయాయి. మహిళామణుల పండుగగా పిలుచుకోనే బతుకమ్మలో సందడిగా ఆడిపాడుతున్నారు. తీరొక్క పూలతో అందంగా తీర్దిదిద్దిన బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడుతున్నారు. కోలాలతో ఆడుతున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సింగరమైన పాటను పాడుతున్నారు. 9 రోజుల ఈ వేడుకలో తంగేడు, జిల్లేడు, గునుగు, బంతి, చేమంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూశాయా అనిపిస్తాయి. బతుకమ్మ పండుగను ఆధ్యాత్మిక సాధకులు సామూహిక 'శక్తి ఉపాసన'గా, ఆత్మచైతన్యానికి మేల్కొలుపుగా భావిస్తారు. బతికించే అమ్మ' అనే ఆరాధనా భావంతో అమ్మవారికి నీరాజనాలు అర్పించటం బతుకమ్మ పండుగలో అంతరార్థం. ఆరోగ్యకర జీవనం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అమ్మను వేడుకోవటం ఆనవాయితీ.
Last Updated : Oct 10, 2024, 8:23 PM IST