రానున్న రోజుల్లో 2515 బస్సులకు అందుబాటులోకి తీసుకువస్తాం : సజ్జనార్ - RTC MD Sajjanar Interview
Published : Mar 12, 2024, 2:26 PM IST
RTC MD Sajjanar Interview : టీఎస్‌ఆర్టీసీ కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటు మరికొన్ని బస్సులను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీకి ప్రయాణికులు పెరిగిన రద్దీ దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్తగా తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 225 కిలో మీటర్ల ప్రయాణించే సామర్థ్యం ఉందన్నారు. వాటి ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు బస్సులో ఛార్జింగ్ పాయింట్లు పెట్టినట్లు వివరించారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. రద్దీ ఎక్కువ ఉంటున్న ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లపై చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రయాణికులకు మరింత సులభమైన ప్రయాణం అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. ఆర్టీసీ తీసుకుంటున్న చర్యల గురించి ఎండీ సజ్జనార్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.