ఆర్టీసీ కండక్టర్ నిజాయతీ - 3 తులాల బంగారం ఉన్న బ్యాగ్ ప్రయాణికురాలికి అప్పగింత - Conductor Returns Gold Bag to wman
Published : Aug 24, 2024, 2:26 PM IST
TGSRTC Conductor Returns Gold Bag to Passenger : విధి నిర్వహణలో ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ చాటింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దుబ్బాక బస్ స్టేషన్ నుంచి కామారెడ్డికి బయలుదేరింది. ఆ బస్సులో దుబ్బాక మున్సిపాలిటీ పరిధి ధర్మాజీపేటకు చెందిన రాజమణి అనే ప్రయాణికురాలు మూడున్నర తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.3000 నగదును పర్సులో పెట్టుకుని ప్రయాణిస్తోంది.
ఆ పర్సును మర్చిపోయి స్టాఫ్ వచ్చిందని దిగిపోయింది. ఆ పర్సను కండర్టర్ దేవమ్మ గమనించింది. అందులో బంగారు ఆభరణాలతో పాటు నగదు ఉన్నట్లు గుర్తించింది. ఆ నగలు, నగదుతో ఉన్న పర్సును దేవమ్మ దుబ్బాక డిపో మేనేజర్‌కు అప్పగించింది. ఆతర్వాత ప్రయాణికురాలు రాజమణిని వాకబు చేసి మూడున్నర తులాల బంగారం, రూ.3000 నగదును ఆమెకు అందజేశారు. కండక్టర్ నిజాయతీని అందరూ ప్రశంసించారు. ఈ బంగారం విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని తెలిపారు. దీంతో ప్రయాణికురాలు ఆనందం వ్యక్తం చేశారు.