వైఎస్సార్సీపీ సేవలో ఆర్టీసీ బస్సులు - గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయాణికుల అవస్థలు - Buses Diverted to CM Jagan Meeting - BUSES DIVERTED TO CM JAGAN MEETING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 3:26 PM IST
RTC Buses Diverted to CM Jagan Meeting in Nandhyala District : సీఎం జగన్ సభలకు ఆర్టీసీ బస్సులను తరలించడంలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో డోన్ బస్టాండులో ప్లాట్ ఫాంలు బస్సుల్లేక ఖాళీగా కనిపించాయి. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాశారు. ఓ వైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
Passengers Facing Problems : దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరకొర వచ్చిన బస్సుల్లో ప్రయాణికులతో నిండిపోవడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నామని తెలియజేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సభలకు బస్సులు తరలిస్తే ప్రయాణికుల పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల పరిస్థితి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది ప్రయాణికులు ప్రైవేటు వాహనాల ద్వారా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.