LIVE : బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ - Lok Sabha Election Poll 2024
Published : Mar 18, 2024, 5:58 PM IST
|Updated : Mar 18, 2024, 6:13 PM IST
RS Praveen Kumar Join in BRS Live : బీఎస్పీకి రాజీనామా చేసిన ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి నేరుగా గజ్వేల్లోని కేసీఆర్ నివాసానికి భారీ ర్యాలీగా ఆర్ఎస్పీ శ్రేణులు చేరుకున్నారు. గజ్వేల్ ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో, ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు. తన రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్‌లో ఆదివారం వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో మేధోమధనం జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే నడుస్తానని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలని చెప్పుకొచ్చారు. తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం ఇవాళ కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరానన్నారు. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటానని పునరుద్ఘాటించారు. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ వివరించారు.
Last Updated : Mar 18, 2024, 6:13 PM IST