దేశంలో లౌకికత్వాన్ని కాపాడాలనే బీఆర్ఎస్తో పొత్తు : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ - RS Praveen about Congress
Published : Mar 6, 2024, 10:43 AM IST
RS Praveen About BRS-BSP Alliance : జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరించి లౌకిక వాదాన్ని కాపాడాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇరు పార్టీల స్నేహంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కూడా బీజేపీ తరహాలోనే ఉందన్న ఆయన, ఈవెంట్ మేనేజ్మెంట్ను తలపిస్తోందని ఆరోపించారు.
Face2Face With BSP leader RS Praveen Kumar : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అంశాలపై మాట్లాడాను తప్ప వ్యక్తులపై కాదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ వివరించారు. బహుజనుల, రైతుల, నిరుద్యోగుల కోసం పోరాటం చేశామని, వాళ్ల కోసమే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకం నామమాత్రంగా ఉందన్న ఆయన, తెలంగాణ ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ ఇవ్వలేకపోతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల హక్కలు పెను ప్రమాదాల్లో పడిందని, వాళ్లను కాపాడేది బీఎస్పీ-బీఆర్ఎస్ కూటమి మాత్రమేనని అన్నారు.