కోర్కెల రొట్టెలతో నెల్లూరుకు భక్తులు - సందడిగా స్వర్ణాల చెరువు - Nellore Rottela Panduga 2024 - NELLORE ROTTELA PANDUGA 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 17, 2024, 2:49 PM IST
Nellore Rottela Panduga: నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు పండుగ వైభవంగా జరగనుంది. ఊరించే వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు స్వర్ణాల చెరువు వద్దకు తరలివస్తున్నారు. చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి తమ కోర్కెల రొట్టెలు పట్టుకుని భక్తులు భుజిస్తున్నారు. బారాషహీద్‌లకు గలేఫ్‌లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
హిందూ- ముస్లింల ఐక్యతకు చిహ్నంగా చరిత్రకెక్కిన ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. ముఖ్యమైన రోజుల్లో రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో బెంగళూరు, చెన్నై, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన వారు ముందే దర్గాకు చేరుకుంటున్నారు. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు ఘాట్, దర్గా ఆవరణలో సందడి నెలకొంది. ఈ పండుగ తమ నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అని భక్తులు చెబుతున్నారు. రొట్టెల పండుగపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు.