ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 12మందికి గాయాలు - ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 1:10 PM IST

Road Accident in RTC Bus Collided With Auto at Rajula Gummada: విజయనగరం జిల్లా వంగర మండలం రాజుల గుమ్మడ గ్రామం వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుల గుమ్మడ వద్ద ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను రాజాంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులంతా శివ్వాం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు.

వివరాళ్లోకి వెళితే శివ్వాం గ్రామంలో ఉన్న 40 మంది కూలీలు సోమవారం రాజులగుమ్మడలో చెరకు గడలు కొట్టేందుకు వెళ్లారు. సాయంత్రం రెండు ఆటోల్లో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో రాజాం నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు రాజులగుమ్మడ సమీపంలోని రైస్‌ మిల్లు వద్ద ఆటోను బలంగా ఢీకొట్టింది. అందులో 16 మంది ఉండగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోండ్రు మురళీమోహన్‌ బాధితులను పరామర్శించారు. రాజాం నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details