లైన్ దాటి యువతిని ఢీకొట్టి - వనస్థలిపురంలో కారు బీభత్సం - Road Accident In Hyderabad - ROAD ACCIDENT IN HYDERABAD
Published : Sep 1, 2024, 7:06 PM IST
Road Accident In Hyderabad : మితిమీరిన వేగంతో వచ్చిన కారు రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని ఢీకొట్టడంతో ఆమె తీవ్ర గాయాలపాలైన ఘటన హైదరాబాద్లోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైయ్యాయి.
పోలీసుల వివరాల ప్రకారం వనస్థలిపురం ఎన్జీఓ కాలనీ వివేకానంద పార్క్ సమీపంలో సోని(21) యువతి నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంతో వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ యువతి 10 మీటర్ల దూరం ఎగిరిపడింది. దీంతో సోనికి తీవ్ర గాయలయ్యాయి. ఆమెను స్థానికులు ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ప్రమాదానికి కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగే కారణమని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు గాళ్లో కలిసిపోతున్నాయి. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పోలీసులు కోరుతున్నప్పటికీ వినకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.