రామోజీ ఫిలింసిటీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు - రామోజీ ఫిలింసిటీలో రిపబ్లిక్ డే
Published : Jan 26, 2024, 2:24 PM IST
|Updated : Jan 26, 2024, 4:10 PM IST
RFC Republic Day Celebrations 2024 : దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అలానే ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలోనూ 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు. రామోజీ ఫిల్మ్‌సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి సంస్థ మానవనరుల విభాగం ప్రెసిడెంట్ గోపాల్‌రావు, యూకేఎంఎల్(ఉషాకిరణ్ మూవీస్ లిమిటెడ్) డైరెక్టర్ శివరామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పబ్లిసిటీ ఏవీ రావు, హార్టికల్చర్ వైస్ ప్రెసిడెంట్ రావి చంద్రశేఖర్ సహా సంస్థ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎండీ విజయేశ్వరికి(Film City Managing Director Vijayeshwari) ఫిల్మ్‌సిటీ సీఈవో శేషసాయి స్వాగతం పలికారు.
Ramoji Film City Flag Hosting Celebrations 2024 : గణతంత్ర వేడుకల్లో రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు. జెండా ఎగురవేసిన అనంతరం సెల్ఫీలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరిలో దేశభక్తి వెల్లివిరిసింది. ప్రతి ఏడాది స్వాతంత్య్ర, రిపబ్లిక్ డే వేడుకలు ఫిల్మిసిటీలో వైభవంగా జరుగుతాయి. ఫిలింసిటీ యాజమాన్యం, ఉద్యోగులు పాల్గొంటారు.