ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 13 hours ago

ETV Bharat / videos

అవుకు రిజర్వాయర్‌ డేంజర్ బెల్స్ - కుంగుతోన్న కట్ట రివిట్‌మెంట్‌ - RESPONSE TO ETV ON RESERVOIR

Response to Etv news on Owk Reservoir: నంద్యాల జిల్లాలోని అవుకు రిజర్వాయర్ ప్రమాదంలో పడిందని ఈటీవీలో ప్రసారమైన వార్తకు అధికారులు పరుగులు పెట్టారు. నిన్ననే దీనిపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జలాశయాన్ని పరిశీలించిన అధికారులు తాత్కాలిక పనులు పూర్తి చేశారు. ఒక మీటర్ విస్తీర్ణం, 1.5 మీటర్ల లోతు నీటిలో మునిగిన రివిట్మెంట్​కు యుద్ధ ప్రాతిపదికన ఇసుక బస్తాలు, మట్టితో మరమ్మతులు చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జలవనరుల అధికారులు తెలిపారు.

ప్రమాదంలో అవుకు రిజర్వాయర్‌: నంద్యాల జిల్లాలోని అవుకు రిజర్వాయర్‌ పరిస్థితి ప్రమాదంలో పడింది. జలాశయం రివిట్‌మెంట్‌ క్రమంగా కుంగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 4 టీఎంసీలను నిల్వ చేశారు. దీంతో రివిట్‌మెంట్‌ క్రమంగా కుంగుతోంది. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు జలాశయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఎస్సార్బీసీ సిబ్బంది, పోలీసులు జలాశయం వద్దకు చేరుకొని కుంగిన చోటును పరిశీలించారు. 

ABOUT THE AUTHOR

...view details