ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తూర్పు నౌకాదళంలో గణతంత్ర వేడుకలు - ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: సక్సేనా - విశాఖలో గణతంత్ర వేడుకలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 5:58 PM IST

Updated : Jan 26, 2024, 6:53 PM IST

Republic Celebrations were Held in Visakhapatnam: విశాఖ తూర్పు నౌకాదళంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐఎన్​ఎస్ సర్కార్స్  పరేడ్ మైదానంలో వివిధ విభాగాల నావికుల నుంచి తూర్పు నౌకాదళ చీఫ్ అడ్మిరల్ సమీర్ సక్సేనా గౌరవ వందనం స్వీకరించారు. నౌకాదళ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఏడాది జరిగే అతిపెద్ద నౌకదళ ఉత్సవం మిలన్ 2024లో 50 దేశాల నౌకాదళ యుద్ధ నౌకలు, సిబ్బంది పాల్గొననున్నారు. భవిష్యత్తులో రాబోయే ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు నౌకాదళం ఎప్పుడు సన్నద్ధంగా ఉంటుందని సక్సేనా తెలిపారు.

Joint naval exercises in Jal Prahar: జల్ ప్రహార్ పేరిట పదాతిదళం, నౌకాదళ సంయుక్త విన్యాసాలు బంగాళాఖాతంలో జరుగుతున్నాయని తూర్పు నౌకాదళం పేర్కొంది. ఆర్మీ, నేవీల మధ్య సమన్వయం కోసం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ తరహా విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. యుద్ద నౌకలోకి నేరుగా ఆర్మీ వాహనాలు అన్ని పంపించి మళ్లీ వాటిని అవసరమైన చోట ఎలా దించుకోవాలనే వాటిపై సాధన చేసినట్లు వెల్లడించింది. మరికొన్ని సంక్షిష్టమైన యుద్ద ప్రక్రియలను సిబ్బంది సాధన చేశారని తూర్పు నౌకాదళం తెలిపింది.

Last Updated : Jan 26, 2024, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details