తెలంగాణ

telangana

ETV Bharat / videos

'తెలుగు ప్రజలను ఏకతాటి పైకి తీసుకు రావడమే కేజీఎఫ్ లక్ష్యం' - tana president niranjan chowdary

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 7:31 PM IST

Release of Kamma Global Federation Brochure : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఏకం చేయడానికి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(KGF) ఏర్పాటు చేసినట్లు కేజీఎఫ్ వ్యవస్థాపకులు జెట్టి కుసుమ కుమార్ తేలిపారు. ఇవాళ హైదరాబాద్ మాదాపూర్​లోని ఈ-గ్యాలేరీయ మాల్​లో జెట్టి కుసుమ కుమార్ అధ్వర్యంలో కేజీఎఫ్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తానా అధ్యక్షులు నిరంజన్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై బ్రోచర్ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఏకతాటి మీదకు తీసుకురావడానికి, తెలుగు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, కమ్మ సామాజిక వర్గ ప్రజల అభివృద్ధికి కేజీఏఫ్ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం జులై 21, 22వ తేదీల్లో రెండు రోజుల్లో గ్లోబల్ ఫెడరేషన్ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో కేజీఏఫ్ విధీ విధానాలను ఈ సదస్సులో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ్టి కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేముల, తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి, రాజధాని ఫైల్స్ సినిమా డైరెక్టర్ రవి శంకర్, కర్ణాటక కమ్మ సంఘం అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ABOUT THE AUTHOR

...view details