LIVE : దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత - మహారాష్ట్ర కోల్బాలోని నివాసానికి పార్థివదేహం తరలింపు ప్రత్యక్ష ప్రసారం - RATAN TATA BODY MOVED TO RESIDENCE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2024, 10:37 AM IST
|Updated : Oct 10, 2024, 10:54 AM IST
Ratan Naval Tata Passes Way Live : దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. మహారాష్ట్ర కోల్బాలోని నివాసానికి రతన్ టాటా పార్థివదేహం తరలించారు. తరువాత ఎన్‌సీపీఏ లాన్‌కు తీసుకువెళ్లారు. పలువురు ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రజలు నివాళులు అర్పించడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10.30 గం.కు ముంబయి ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు పార్థివదేహాన్ని తరలిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయంత్రం రతన్ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ఆయన మృతి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంతాప దినం ప్రకటించింది.
Last Updated : Oct 10, 2024, 10:54 AM IST