ETV Bharat / state

నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి-సముద్రంలో పడిపోయిన ఇద్దరు నావికులు - NAVY PREPARATORY EXERCISES

ప్యారాచూట్ల ద్వారా నావికులు దిగుతున్న క్రమంలో గాలి అనుకూలించకపోవడంతో అపశ్రుతి

discord_in_navy_preparatory_exercises_in_visakhapatnam
discord_in_navy_preparatory_exercises_in_visakhapatnam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2025, 10:08 AM IST

Discord in Navy Preparatory Exercises In Visakhapatnam : విశాఖ తీరంలో జరిగిన నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ నెల 4న జరగనున్న నౌకాదళ వేడుకల సందర్భంగా గురువారం పూర్తిస్థాయి సన్నాహక విన్యాసాలు నిర్వహించారు. విమానాల నుంచి రెండు ప్యారాచూట్ల ద్వారా నావికులు దిగుతున్న క్రమంలో గాలి అనుకూలించకపోవడంతో ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీంతో ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు. అప్పటికే సముద్రంలో ఉన్న జెమినీ బోట్ల సిబ్బంది వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి-సముద్రంలో పడిపోయిన ఇద్దరు నావికులు (ETV Bharat)

ఆకట్టుకున్న లేజర్, డ్రోన్‌ షోలు : సముద్రంలో సుమారు 12 నౌకల పైనుంచి నిర్వహించిన లేజర్‌ షో ఆకట్టుకుంది. అనంతరం డ్రోన్‌ షో చేపట్టారు. దేశ చిత్రపటం, నౌక, సబ్‌మెరైన్, ఫైటర్‌ జెట్, యుద్ధ ట్యాంకులు, సైనికుడు, కళింగ చక్రవర్తి, మేకిన్‌ ఇండియా, సింహం వంటి ఆకృతులను డ్రోన్‌ షోలో ప్రదర్శించారు.

నింగీ నేల విన్యాసాల హేల - విశాఖ తీరంలో ఆకట్టుకున్ననేవీ రిహార్సల్స్‌

8న విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.