Second Day in Gunadala Lourdhu Matha Celebrations: విజయవాడ గుణదల లూర్ధుమాత తిరునాళ్ల మహోత్సవాలు ఉదయ కాల ప్రార్థన, సమిష్టి బలిపూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. గుణదల పీఠాధిపతి బీషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి అనంతరం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రోమన్ క్యాథలిక్ వివిధ పీఠాధిపతులు గుణదల మేరీ మాత వైభవం పై ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న భక్తులను ఆశీర్వదించారు. భారీగా హాజరైన భక్తులు గుణదల మేరీ మాత కొండ పైకి చేరుకొని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవాడ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అనంతరం బేషప్ జోసఫ్ రాజారావు మాట్లాడుతూ 101 వ ఏడాది గుణదల మేరీ మాత వార్షిక మహోత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నామని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ పీఠం మ్యాన్స్ నోరు జనరల్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరగనున్న ఈ వార్షికోత్సవంలో ప్రతిరోజు దివ్య బలి పూజా కార్యక్రమంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, లక్షలాదిమంది పాల్గొని ఈ తిరునాళ్ల మహోత్సవాల్లో ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పూజలు నిర్వహించుకునేలా ఆలయ కమిటీ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తుందని తెలిపారు.
గుణదల మేరీ మాత శతాబ్ది ఉత్సవాలు - భారీగా తరలిరానున్న భక్తులు