Man Cheated By Cyber Fraudsters In Manyam District: సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. పార్వతీపురం మండలంలో ఓ వ్యక్తికి 12 లక్షలు ఆశ చూపించి అతని వద్ద నుంచి సుమారు 2 లక్షల రూపాయలను కాజేశారు. దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోనికి వెళ్తే
స్థానికుల కథనం ప్రకారం: గంగాపురం పంచాయతీ కోరి గ్రామానికి చెందిన రాయల శంకరరావు లారీ డ్రైవరు. పాత రూపాయి నోటు మీ వద్ద ఉంటే 12 లక్షలు సొంతం చేసుకోవచ్చంటూ యూట్యూబ్‌లో వచ్చిన ప్రకటన చూసి సదరు వ్యక్తులతో సంప్రదింపులు జరిపాడు. వారు తొలుత కొంత నగదు కట్టాలని కోరడంతో విడతల వారీగా 2 లక్షల రూపాయలు చెల్లించాడు. తర్వాత 12 లక్షల కోసం అడగ్గా ఫోన్ కట్ చేశారు. ఎన్నిసార్లు చేసినా అందుబాటులోకి రాకపోవడంతో నష్టపోయినట్లు గుర్తించి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
'10 రోజులపాటు హింసించారు' - రూ.36 లక్షలు పోగొట్టుకున్న విశ్రాంత ఉద్యోగి
టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌నంటూ సైబర్ నేరాలు - నిందితుడి అరెస్ట్