ETV Bharat / state

రైలు ఎక్కలేం, బస్సును భరించలేం - ప్రైవేటు ఛార్జీ తెలిస్తే నోరెళ్లబెడుతారు! - SANKRANTI FESTIVAL TRAIN AND BUS

సంక్రాంతికి కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు - 9 నుంచి 12వ తేదీ వరకు భారీగా ప్రయాణాలు - ప్రైవేటులో అడ్డగోలుగా ధరలు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2025, 9:59 AM IST

Train And Bus Reservation Filled Due To Sankranti Festival : సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీసంఖ్యలో సిద్ధమవుతున్నారు. అయితే ప్రయాణానికి మాత్రం భారీ ‘వ్యయ’ప్రయాసలు తప్పడం లేదు. రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోగా ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. విమాన టికెట్ల ధరలకూ రెక్కలొచ్చాయి. దీంతో పలు ప్రైవేటు బస్సుల యజమానులు అడ్డగోలు దోపిడీకి తెరతీస్తున్నారు. పండక్కి ఎలాగైనా సొంతూళ్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రజలు సిద్ధమవుతుండటంతో ఇదే అదనుగా ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్రైవేటు స్లీపర్‌ ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి గరిష్ఠంగా రూ.7వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌కు రూ.2,300, మంచిర్యాలకు రూ.3,500 తీసుకుంటున్నారు. జనవరి 9 నుంచి 12 వరకు రైళ్లు, బస్సులు, విమాన టికెట్లకు డిమాండ్‌ అధికంగా ఉంది.

భగ్గుమంటున్న టికెట్ల ధరలు :

సంక్రాంతి పండగ దగ్గరపడే కొద్దీ ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలు భగ్గుమంటున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లేవారు స్లీపర్‌ బస్సులకు ప్రాధాన్యమిస్తారు. దీంతో లోయర్‌ బెర్తులకు, కొన్ని బస్సుల్లో ముందువరుస సీట్లకు అదనంగా వసూలు చేస్తున్నారు. టికెట్‌ ఛార్జీలపై జీఎస్టీ కూడా వసూలుచేస్తున్నారు. జనవరి 12న హైదరాబాద్‌ నుంచి విశాఖకు ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్‌ బస్సులో టికెట్‌ ధర రూ.6,999, జీఎస్టీ రూ.349.95 కలిపి మొత్తం రూ.7,348.95 వసూలు చేస్తున్నారు. తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలకు బస్సుల డిమాండ్‌ అధికంగా ఉంది. ఆర్టీసీతో పాటు ప్రైవేటు ఆపరేటర్లూ అదనపు బస్సులు నడుపుతున్నారు.

హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌కు జనవరి 13న ఆర్టీసీ స్లీపర్‌ బస్సులో సీటు టికెట్‌ రూ.810. అదే ఓ ప్రైవేట్‌ బస్సులో ఛార్జి రూ.1,200. స్లీపర్‌ బెర్తు టికెట్‌కు ఆర్టీసీ బస్సుల్లో రూ.1,040 అయితే ఓ ప్రైవేటు బస్సులో ధర రూ.2,300. మంచిర్యాలకు ఆర్టీసీ బస్సులో బెర్తు ధర రూ.860 అయితే ఓ ప్రైవేట్‌ బస్సులో ఏకంగా రూ.3,700గా నిర్ణయించారు.

విమాన ఛార్జీలకూ రెక్కలు!

విమాన ప్రయాణ టికెట్లు సైతం దాదాపు మూడింతలు అయ్యాయి. దూరప్రాంతాలకు ప్రయాణ సమయం ఒకట్రెండు గంటలే కావడంతో విమానాల్లో 11, 12 తేదీల్లో ఎక్కువమంది వెళుతున్నారు. జనవరి 11న హైదరాబాద్‌-విశాఖపట్నం టికెట్‌ ధరలు రూ.10,019 నుంచి రూ.13,536 వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో టికెట్‌ సుమారు రూ.3,900 ఉంటుంది.

హైదరాబాద్‌-విజయవాడ విమాన టికెట్‌ సాధారణంగా రూ.2,600కే దొరుకుతుంది. సంక్రాంతి సమయంలో కనీస ధర రూ.6,981, గరిష్ఠంగా రూ.16వేలకు పైగా ఉంది. హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం విమాన టికెట్ల ధరలు 10-12 తేదీల్లో కనిష్ఠంగా రూ.7,135, గరిష్ఠంగా రూ.15వేలకు పైగా ఉన్నాయి.

ఛార్జీల నియంత్రణపై చర్యలేవీ!

ప్రైవేటు ఆపరేటర్లు అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతున్నా నియంత్రించడంలో తెలంగాణ రవాణాశాఖ ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. ఛార్జీల దోపిడీ వెబ్‌సైట్లు, యాప్‌లలో కనిపిస్తున్నా కట్టడికి అధికారులు ప్రయత్నాలు చేయడం లేదు.

రైళ్లన్నీ ‘రిగ్రెట్‌’..

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి రెండు వందేభారత్‌ రైళ్లున్నా వీటిలో టికెట్లు ఎప్పుడో అయిపోయాయి. ఈ నెల 8 నుంచి 12 వరకు ‘రిగ్రెట్‌’ ఉంది. గరీబ్‌రథ్‌లో 7 నుంచి 12 వరకు ఇదే పరిస్థితి. గోదావరి, విశాఖ, జన్మభూమి, ఫలక్‌నుమా, కోణార్క్, ఈస్ట్‌కోస్ట్‌ ఇలా ప్రధాన రైళ్లలో నిల్చొని ప్రయాణించేందుకూ టికెట్లు దొరికే పరిస్థితి లేదు. ఈ రైళ్లలో నిరీక్షణ (వెయిటింగ్‌లిస్ట్‌) పరిమితి ఎప్పుడో దాటేసి ‘రిగ్రెట్‌’కు చేరింది.

  • ద.మ.రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించగా ఆన్‌లైన్‌లో నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అయిపోతున్నాయి. దూరం, ప్రయాణ తరగతిని బట్టి ప్రత్యేక రైళ్లలో ఒక్కో ప్రయాణికుడిపై రూ.70 నుంచి రూ.320 వరకు అదనపు భారం పడుతోంది.
  • వెంకటాద్రి, పద్మావతి, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో 9 నుంచి 12 వరకు వెంకటాద్రి, శబరి ఎక్స్‌ప్రెస్‌లలో 13 వరకు ‘రిగ్రెట్‌’కు చేరింది. శాతవాహన, సింహపురి, గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో 10 నుంచి 13 వరకు ఇదే పరిస్థితి.

ఆర్టీసీ బస్సులూ ఫుల్లే..

ఏపీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు నిత్యం 352 బస్సులు నడుపుతోంది. సంక్రాంతికి 9 నుంచి 12వ తేదీ వరకు 2,400 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. అదనపు ఛార్జీలు లేకపోవడంతో విపరీతమైన డిమాండ్‌ ఉంది. 10న హైదరాబాద్‌-కాకినాడకు 9 స్పెషల్, 8 రెగ్యులర్‌ బస్సులు ఉంటే వాటిలో ఒక్కసీటూ ఖాళీ లేదు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, అమలాపురం, విజయవాడ, ఒంగోలు, కందుకూరు ఇలా వివిధ రూట్లలో ఇదే పరిస్థితి.

టీజీఎస్‌ఆర్టీసీ తెలంగాణ పరిధిలోను, హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 6,432 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి కాకినాడకు 10వ తేదీన 3 రెగ్యులర్‌ బస్సులు నడుపుతోంది. 9 ప్రత్యేక బస్సులు వేసినా చాలడం లేదు. ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నా సీట్లు దొరకడం లేదు. తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వచ్చే అవకాశం ఉండటంతో 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

‘బెంగళూరు-హైదరాబాద్‌’ రూ.10 వేలు!

బెంగళూరులో తెలంగాణకు చెందిన ఐటీ ఉద్యోగులు అధికసంఖ్యలో ఉంటున్నారు. వారు పండక్కి వచ్చేందుకు సిద్ధమవుతుండటంతో అటు నుంచి కూడా ‘బాదుడు’ ఎక్కువగా ఉంది. ఓ ప్రైవేటు బస్సులో ఈ నెల 12న గరిష్ఠంగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రూ.9,999 వసూలు చేస్తున్నారు.

సంక్రాతి ఎఫెక్ట్ : ఆర్టీసీ బస్సుల్లో దొరకని సీట్లు! - దోచేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌

వాహనదారులకు టోల్​ మోత - రోజులో ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ కట్టాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.