LIVE: రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం - Rajya Sabha Session
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 11:04 AM IST
|Updated : Feb 10, 2024, 6:31 PM IST
Rajya Sabha Sessions Live : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు ముందు బడ్జెట్ సమావేశాలు కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఈ విషయమై వివరణ కోరారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం భూమి కేటాయించలేదని కేంద్రమంత్రి చెప్పారు. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం భూమిని కేటాయిస్తూ తాము లేఖలు రాసినా రైల్వేశాఖ ముందుకు రాలేదని పేర్కొంది. జోన్ ఏర్పాటుకు ఏం అడ్డంకులు ఉన్నాయని ప్రశ్నించారు. అందుకు అశ్వినీ వైష్ణవ్ బదులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 52 ఎకరాల భూమి ఒక చెరువు బ్యాక్‌వాటర్‌లో ఉందని, అది ముంపు ప్రాంతమని, కార్యాలయ నిర్మాణానికి అనువైంది కాదని తెలిపారు. అందువల్ల నిర్మాణానికి అనువైన భూమిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పామని పేర్కొన్నారు.
కాగా ఫిబ్రవరి 9వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. కానీ బడ్జెట్ సమావేశాలు కావడంతో మరో రోజుకు పొడిగించారు. నేటితో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. శీతాకాల సమావేశాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.