LIVE : రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్షప్రసారం - Rajya Sabha Sessions Live - RAJYA SABHA SESSIONS LIVE
Published : Aug 6, 2024, 11:08 AM IST
|Updated : Aug 6, 2024, 5:39 PM IST
Rajya Sabha Sessions Live : రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. కేరళ వయనాడ్లో జరిగిన కొండచరియలు విరిగిపడిన ప్రమాదంపై సభలో వాడీవేడి చర్చ జరిగింది. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని రాజ్యసభలో అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశామని కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదని ఆరోపించారు. భారీ వర్షాలు కురవగానే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ రాష్ట్రానికి పంపించామని వివరించారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై అనేక ప్రశ్నలు వస్తున్నాయని అమిత్ షా చెప్పారు. వీటన్నింటిపైనా ఓ స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాని అన్నారు. 2014 తర్వాత హెచ్చరిక వ్యవస్థపై ప్రభుత్వం సుమారు రూ.2,000ల కోట్లను ఖర్చు చేసిందని వివరించారు. ఈ వ్యవస్థను 2016, 2023లో ఆధునీకరించామని తెలిపారు. ప్రపంచంలోనే ఆధునిక హెచ్చరిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ ఒకటిని పేర్కొన్నారు. వారం రోజుల ముందే ప్రమాదాన్ని గుర్తించే 4 దేశాల్లో భారత్ ఒకటని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో వాడివేడి చర్చ జరుగుతోంది.
Last Updated : Aug 6, 2024, 5:39 PM IST