LIVE : రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - Rajya Sabha Sessions 2024 - RAJYA SABHA SESSIONS 2024
Published : Aug 8, 2024, 11:30 AM IST
|Updated : Aug 8, 2024, 1:02 PM IST
Rajya Sabha Sessions Live : ఆర్థిక బిల్లు-2024ను లోక్సభ బుధవారం ఆమోదించింది. ఇక ఈ బిల్లు చర్చ కోసం రాజ్యసభకు వెళ్లనుంది. దాన్ని తిరస్కరించే అధికారం ఎగువ సభకు ఉండదు. 14 రోజుల్లోగా ఆ సభ బిల్లుకు ఆమోద ముద్ర వేయకపోతే అది ఆమోదం పొందినట్లు భావిస్తారు. కొత్తగా ప్రవేశ పెట్టిన 'స్థిరాస్తి పై మూలధన రాబడి పన్ను' నిబంధనలను ప్రభుత్వం సవరించిన అనంతరం తాజా ఆర్థిక బిల్లు ఆమోదం పొందింది. తక్కువ రేటు కలి గిన కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలా? లేదా ఇండెక్సేషన్ ప్రయోజనంతో కూడిన అధిక రేటు పాత విధానంలోనే కొనసాగాలా? అనే రెండు ఐచ్చికాల్లో దేన్ని ఎంచుకోవాలన్న దానిపై పన్ను చెల్లింపుదారులకు తాజాగా స్వేచ్ఛ కల్పించారు. ఈ ఏడాది జులై 23కుముందు కొనుగోలు చేసిన ఆస్తుల విక్రయంపై ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తాజా సవరణలతో ప్రభుత్వం పునరుద్ధరించినట్లయింది. లోక్సభ గతవారం ఆమోదించిన వ్యయ బిల్లు (నంబర్ 2)- 2024, జమ్మూకశ్మీర్ వ్యయ బిల్లు (నంబర్ 3)- 2024లను నిర్మలా సీతారామన్ బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. నేడు దానిపై చర్చ జరగనుంది. రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.
Last Updated : Aug 8, 2024, 1:02 PM IST