LIVE : రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - Rajya Sabha Session Live - RAJYA SABHA SESSION LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 3, 2024, 11:14 AM IST
|Updated : Jul 3, 2024, 2:03 PM IST
Rajya Sabha Session 2024 Live : పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. రాజ్యసభలో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. ఖర్గే వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టిన ధన్‌ఖడ్, ఛైర్మన్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లికార్జున ఖర్గే స్థానంలో జైరాం రమేశ్ కూర్చుంటే బాగుంటుందన్నారు. ఛైర్మన్ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ చూడలేదని జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు . సమావేశం మధ్యలో తరచూ లేచి మీకు తోచింది మాట్లాడుతున్నారని, అయినా మీ గౌరవాన్ని కాపాడేందుకు చాలా ప్రయత్నించానని మల్లికార్జున ఖర్గేపై జగ్‌దీప్ ధన్‌ఖడ్ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఏదో చెప్పడానికి లేచి నిలబడితే ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆయణ్ని వారించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ఇవాళ ప్రధామంత్రి నరేంద్ర మోదీ సమాధానమివ్వనున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Jul 3, 2024, 2:03 PM IST