రాజ్‌భవన్ 'ఎట్ హోమ్' కార్యక్రమంలో గవర్నర్ తేనేటి విందు - గవర్నర్ ఇచ్చే తేనేటి విందు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 9:51 PM IST
Raj Bhavan At Home: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్ 'ఎట్ హోమ్' లో అతిథులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ముఖ్యమంత్రితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్ర మంత్రులు, రాజకీయ పార్టీ నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్‌భవన్ 'ఎట్ హోమ్' కార్యక్రమం నిర్వహించడం ఇది రెండోసారి. గత సంవత్సరం ఫిబ్రవరిలో జస్టిస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
రాజ్‌భవన్ 'ఎట్ హోమ్' : ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నాతాధికారులకు రాష్ట్ర గవర్నర్ ఇచ్చే తేనేటి విందు కార్యక్రమాన్ని రాజ్‌భవన్ 'ఎట్ హోమ్' అని పిలుస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ ఒకేసారి హాజరవుతారు.