ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విజన్‌ ఉన్న నాయకుడ్ని వదిలేసి సోది చెప్పే వారిని ఎన్నుకున్నాం: ఎంపీ రఘురామ - చంద్రబాబు నాయుడుపై పుస్తకాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 9:30 AM IST

MP Raghu Rama Krishna Raju Comments: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌ కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. విజన్‌ ఉన్న నాయకుడ్ని వదిలేసి, సోది చెప్పే వారిని ఎన్నుకొని తప్పు చేశామన్నారు. మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న జాతీయ పుసక్త ప్రదర్శనలో చంద్రబాబుపై డాక్టర్‌ ఇనగంటి లావణ్య రాసిన మూడు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీబీఎన్‌ అభివృద్ధి రథసారధి, బాబుగారి పాలనలో బయటకురాని వాస్తవాలు, శ్రీరామచంద్ర రాజ్యం అనే మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న, పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని జ్యోత్స్న అన్నారు.  రామరాజ్యమంటే చంద్రన్న పాలన అని రచయిత్రి లావణ్య కొనియాడారు. చంద్రబాబు పాలన ఎలా ఉందనే విషయాలను ఈ పుస్తకాల్లో వ్యక్తీకరించినట్లు లావణ్య తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details