ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుమలలో "జై జై అమరావతి" - మంత్రి రోజాను చుట్టుముట్టిన శ్రీ వారి సేవకులు - Protest Against Minister RK

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 11:39 AM IST

Updated : Feb 2, 2024, 11:46 AM IST

Protest Against Minister RK Roja in Tirumala : తిరుమలలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. రోజా ఎప్పటిలాగే శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఈ సమయంలో మంత్రికి ఊహించని వ్యక్తుల నుంచి నిరసన సెగ తగిలింది. దీంతో షాక్​కు గురైన రోజా అక్కడ నుంచి మెల్లిగా జారుకున్నారు. 

ఆర్కే రోజా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి తిరుమల శ్రీవారిని నిత్యం దర్శించుకుంటున్నారు. అందులో భాగంగానే ఎప్పటిలాగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రోజా చుట్టూ చేరిన శ్రీవారి సేవకులు "జై అమరావతి, జై జై అమరావతి" అంటూ నినాదాలు చేశారు.  జై అమరావతి నినాదాలతో మంత్రిని చుట్టుముట్టారు. జై అమరావతి నినాదాలు చేయమని, ఒకే రాజధానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో రోజా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. శ్రీవారి సేవకు వచ్చి ఇదేమిటంటూ వారికి సమాధానం చెప్పకుండా, నవ్వుకుంటూ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు రోజా.

Last Updated : Feb 2, 2024, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details