ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఓటు వద్దు- రోడ్డు కావాలి'- ఎన్నికలు బహిష్కరిస్తామంటూ కలెక్టరేట్​ వద్ద ఆందోళన - Protest Against Elections - PROTEST AGAINST ELECTIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 4:03 PM IST

Protest Against Elections due to No Roads: తమ గ్రామానికి రహదారి వేయకపోతే సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామంటూ విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం భోజరాజపురం గ్రామస్థులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లుగా తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వాపోయారు. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి గుంతల మయంగా మారటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రభుత్వాలు, నాయకులు ఎందరు మారతున్నా తమ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు సమకూరలేదన్నారు. ఈ నేపథ్యంలో మే 13న జరగనున్న ఎన్నికలను బహిస్కరిస్తామంటూ 'ఓటు వద్దు- రోడ్డు కావాలి' అంటూ నిరసనలు చేశారు. 

"మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ జరగలేదు. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కూడా లేదు. ప్రభుత్వాలు, నాయకులు ఎందరు మారతున్నా గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు సమకూరలేదు. ఈ నేపథ్యంలో మా గ్రామానికి రహదారి వేయకపోతే సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తాం." - సత్యారావు, భోజరాజపురం గ్రామస్థుడు

ABOUT THE AUTHOR

...view details