ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'వారం నుంచి నీళ్లు లేవు - మా కాలనీ వైపు చూడండి కొడాలి నాని గారూ' - టిడ్కో ఇళ్ల వద్ద మహిళలల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 5:14 PM IST

Problems in TIDCO Houses at Krishna District : కృష్ణా జిల్లా గుడివాడలోని టిడ్కో ఇళ్ల (TIDCO Houses) వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. కాలనీ సమస్యల వలయంలో ఉన్నా పట్టించుకునే వారు దిక్కు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి తాగునీరు రాక అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. డ్రైనేజీ, దొంగల బెడద ఎక్కువగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని ( MLA Kodali Nani) ఇప్పటి వరకూ కాలనీ వైపు కన్నెత్తి చూడలేదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరుతున్నారు.

Protest At Tidco Houses : ఒక రోజు ఎమ్మెల్యే ఇంట్లో నీళ్లు ఆపితే తమ బాధ తెలుస్తుందని మహిళలు మండిపడ్డారు. అధికారులు కనీసం తమని మనుషులుగా గుర్తించడం లేదని బాధితులు వాపోతున్నారు. కనీసం బాత్రూమ్ వినియోగానికి కూడా నీళ్లు (Water) లేని పరిస్థితి ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details