ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రన్నింగ్ బస్సులో పనిచేయని స్టీరింగ్ - కళాశాల విద్యార్థులకు తప్పిన పెను ముప్పు - క్యాబిన్​లో చిక్కుకున్న డ్రైవర్ - Private College Van Hit Tree - PRIVATE COLLEGE VAN HIT TREE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2024, 1:28 PM IST

Private College Van Hit Tree Sever Injured in YSR District : ఆపద ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. రోడ్డుపైకి వెళ్తే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని ఘటనలు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల అయితే మరి కొన్ని సాంకేతిక కారణాల వల్ల జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనే వైఎస్సార్​ జిల్లాలో జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

కమలాపురం మండలం కొండాయపల్లె వద్ద చెప్పలి నుంచి వస్తున్న ప్రైవేటు కళాశాల వ్యాన్​ ప్రమాదానికి గురైంది. ఉన్నట్టుండి వాహన స్టీరింగ్‌ పని చెయ్యక పోవడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రథమ చికిత్స అందించారు. వ్యాన్​ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జేసీబీ సాయంతో అతడ్ని బయటకు తీశారు.

 

ABOUT THE AUTHOR

...view details